సాక్షి, వరంగల్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలనుకున్న ఓ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ సదరు నేతను చుక్కలు చూపించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. దీంతో, రెండు నెలల క్రితమే బీఆర్‌ఎస్.. మోహన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.
ఇక, మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు అధికారపక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోహన్‌రెడ్డి హస్తం పార్టీలో చేరడాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారు మంజుల నడివీధిలో ఆయనను చెప్పుతో కొట్టింది. ఆయన కాంగ్రెస్ చేరకూడదని డిమాండ్ చేశారు. అయితే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment