గజ్వేల్‌లో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.85 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పట్టపగలు పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అబద్ధాలాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీసీబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత మరో ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బీఆర్ ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవ డానికి కేసులు వేస్తే, బీజేపీ దానికి ఒక్క రూపాయి ఇవ్వకున్నా రూ.85 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఈ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతు న్నాయని అన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోగా, కాంగ్రెస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. రూ.20 వేల కోట్ల రుణమాఫీని నెల రోజుల్లోనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజారంజక పాలన తో వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment