కాంగ్రెస్‌ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్‌ రావు ఫైర్‌ | Harish Rao Political Counter Attack To Congress Party, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్‌ రావు ఫైర్‌

Published Thu, May 23 2024 10:45 AM | Last Updated on Thu, May 23 2024 12:35 PM

Harish Rao Political Counter Attack To Congress

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడేది లేదు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాగా, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి హత్యపై హరీష్‌ రావు స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా హరీష్‌ రావు..‘కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement