నేడు ‘ఇండియా’ కూటమి వర్చువల్‌ భేటీ  | INDIA blocs Crucial Virtual Meeting Today | Sakshi
Sakshi News home page

నేడు ‘ఇండియా’ కూటమి వర్చువల్‌ భేటీ 

Published Sat, Jan 13 2024 7:12 AM | Last Updated on Sat, Jan 13 2024 7:14 AM

INDIA blocs Crucial Virtual Meeting Today - Sakshi

(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నేతలు ఈ నెల 13న సమావేశం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. శనివారం ఉదయం వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ పాల్గొనడం లేదు. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. నితీశ్‌ కుమార్‌కు ఇండియా కూటమి కనీ్వనర్‌ బాధ్యతలివ్వాలంటూ జేడీయూ కోరుతుండగా, టీఎంసీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. ఈ అంశంపైనా నేటి సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement