సాక్షి, విజయవాడ: టీడీపీలో కోల్డ్‌వార్ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో పచ్చ పార్టీలో ముసలం చోటుచేసుకుంది. ఇక, టీడీపీ హైకమాండ్ నిర్ణయంపై తాజాగా కేశినేని నాని స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తినబోతూ రుచులెందుకు అంటూ సెటైర్లు వేశారు. దీంతో, ఆయన కామెంట్స్ టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. అటు, టీడీపీ నేతలను సైతం టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.
అయితే, టీడీపీ హైకమాండ్ నిర్ణయం తర్వాత నాని కేశినేనిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాలో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘నేను పార్టీలో కొనసాగాలో వద్దో నా అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారు. తినబోతూ రుచులు ఎందుకు?. నన్ను తిరువూరు సభకు రావొద్దని చెప్పారు. నేను వెళ్తే మళ్లీ గొడవలు మొదలవుతాయి. నేను ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తా. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం ప్రకటిస్తా. వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడిని. నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు. కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కేడర్ ఎదురుచూస్తోంది. ఒక్కొక్కరుగా నా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, అంతకుముందు కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment