కాంగ్రెస్‌వి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు | Kishan Reddy Fires on Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌వి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు

Published Sat, Feb 3 2024 4:28 AM | Last Updated on Sat, Feb 3 2024 10:53 AM

Kishan Reddy Fires on Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. భూములకు సంబంధించిన లావాదేవీల విషయంలో బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు డబ్బులు సమకూర్చడానికి బిల్డర్లు, భూ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవినీతి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు అయ్యా­యని విమర్శించారు.

అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకుంటామన్న రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదని  నిలదీశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమా­వేశం జరిగింది. రాష్ట్రపార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, జాతీయ ప్రధాన కార్య­దర్శి బండి సంజయ్, జాతీయ నేతలు డీకే అరుణ, పి.మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసినందుకు, వికసిత భారత్‌ సాకారం చేయడానికి వీలుగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

హామీల అమలుపై క్లారిటీ లేదు 
‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక రోడ్‌మ్యాప్‌ లేదు. ఇచి్చన హామీల అమలుపై క్లారిటీ ఇవ్వడం లేదు. పార్లమెంట్‌ ఎన్నికల వరకు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ బూత్‌ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరి చేసుకోవాలి. గ్రామ స్థాయిలో నిత్యం కొత్తగా చేరికలు ప్రోత్సహించాలి. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలి..’అని కిషన్‌రెడ్డి సూచించారు. 

17 సీట్లు గెలిస్తే రాహుల్‌ ప్రధాని అవుతారా? 
తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్‌ ప్రధాని అవుతారని కాంగ్రెస్‌ నేతలు మాయ మాటలు చెబుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదాధికారుల భేటీ తర్వాత నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు , ఇతరనాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఇచి్చన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించామని అరుణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 10 నుండి 12 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.  

ఇక బిజీబిజీ 
పదాధికారుల సమావేశంలో నిర్ణయించిన మేరకు రాష్ట్ర పార్టీ నాయకులు లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బిజీబిజీ కానున్నారు. ఈ నెలలో 17 ఎంపీ సీట్ల పరిధిలో బీజేపీ ‘విజయసంకల్ప రథ (బస్సు)యాత్రలు’నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతారు. 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో బాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటల పాటు ఉంటారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. 4 ,5, 6 తేదీల్లో పార్లమెంట్‌ ప్రవాసీ యోజన ఉంటుంది. 18 నుండి 24 వరకు నారీ శక్తి వందన్‌ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారుల సమ్మేళనాలు, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీలో ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు ఉంటాయి. 

నో మొబైల్స్‌! 
పార్టీ అంతర్గత సమావేశాల్లో ముఖ్యనేతలు చెబుతున్న విషయాలపై దృష్టి పెట్టకుండా నేతలు సెల్‌ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ.. శుక్రవారం నాటి పదాధికారుల భేటీకి మొబైళ్లను అనుమతించలేదని తెలిసింది. సెల్‌ఫోన్లు అన్నీ ఒకచోట డిపాజిట్‌ చేశాకే నేతలను సమావేశ మందిరంలోకి అనుమతించినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement