పట్నం అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్‌.. మరో ఉద్యమం తప్పదంటూ.. | KTR And Other BRS Leaders Responds Over Patnam Narender Reddy Arrest Issue | Sakshi
Sakshi News home page

పట్నం అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్‌.. మరో ఉద్యమం తప్పదంటూ..

Published Wed, Nov 13 2024 9:15 AM | Last Updated on Wed, Nov 13 2024 11:29 AM

KTR And Other BRS Leaders Responds Over Patnam Narender Reddy Arrest Issue

సాక్షి, హైదరాబాద్‌: లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్‌ఎస్‌ నేతలు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అంటూ హెచ్చరించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.

తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర

కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది.

ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు.

పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారు

ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.

	పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్

రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది.

ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం.

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.

వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అంటూ డిమాండ్‌ చేశారు. 

 

పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. నరేందర్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ..‘కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా?’ అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement