సాక్షి,హైదరాబాద్: పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునున్నామని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసింది.పార్టీ పెట్టిన తర్వాత మెదటిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి పదవినికి కాపాడుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉద్దండులతోనే మన పార్టీ కొట్లాడింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో నష్టం చేస్తున్నారు. తమకు అండగా నిలవాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారు.తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు.
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోంది.నవంబర్ 5న జరిగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పాలనలో భాదపడని వారు లేరు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయి. హరీష్ రావు కుట్రతోనే నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి అనుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడదు?కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ప్రత్యుర్థులే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. అందరికి అవకాశాలు వస్తాయి’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment