తెలంగాణలో ప్రభుత్వం ఉందా? లేదా?: కేటీఆర్‌ | KTR Serious Comments Over Congress Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ప్రభుత్వం ఉందా? లేదా?: కేటీఆర్‌

Published Wed, May 29 2024 9:31 AM | Last Updated on Wed, May 29 2024 10:20 AM

KTR Serious Comments Over Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.. లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్పా? అని ప్రశ్నించారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..?  లేనట్టా..?
విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు?

పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?
ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది?

ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..
ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?

నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!
నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!

పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. 
ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?

సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..
ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా?

తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే..
సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా?

గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..
10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా?

రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..
రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..

దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. 
అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ?

బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా?

ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!
బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయండి..!!

కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. 
అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!

లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..
కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!’ అని కామెంట్స్‌ చేశారు. 

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement