
సాక్షి, గుంటూరు జిల్లా: లోకేష్‌ది యువగళం కాదు.. యువ గరళం అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా లోకేష్ తీరు ఉందని దుయ్యబట్టారు.
‘‘అచ్చెన్నాయుడు మాటల తీరుపై రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. పోలీసులను ఉద్దేశించి బూతులు మాట్లాడతారా?. అచ్చెన్నాయుడు బూతులు మాట్లాడటం టీడీపీ పతనానికి నాంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా?. లోకేష్‌కు అర్హత అనే మాట కూడా స్పష్టంగా పలకడం రాదు. లోకేష్ చిత్తశుద్ధిలేని పాదయాత్ర చేస్తున్నారు. చిత్తశుద్ధి లేని పాదయాత్ర మంచిది కాదు. ఇంతకీ సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదు’’ అని అంబటి అన్నారు.
‘‘లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడు. ఆయన యాత్ర అంతా కాలక్షేపం కోసమే. ఎంతమంది కలిసొచ్చిన జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు. లోకేష్‌కు ప్రజలు తగిన సమాధానం చెబుతారు’’ అని మంత్రి అంబటి నిప్పులు చెరిగారు.
చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌంట్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment