విజయవాడ: ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 14 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్దాలేనని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ పోలవరం శంఖుస్ధాపన చేయగా.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ దానిని పూర్తి చేస్తారని అన్నారు.
'వైఎస్సార్ నిర్మించిన కాలువలలో గోదావరి నీళ్లు పారించి పట్టిసీమ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు. రైతులకు రావలసిన ఆర్ & ఆర్ ప్యాకేజీని చంద్రబాబు తాకట్టు పెట్టారు. ప్రాజెక్ట్‌లని సందర్శించే నైతికత చంద్రబాబుకి లేదు. రాబోయే ఆరు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు రెస్ట్ ఇస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని చంద్రబాబు చూస్తున్నాడు. పుంగుటూరు ఘటన చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగింది. ముందుగా లేకపోతే ఆ తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచీ వచ్చాయి.' అని బొత్స సత్యనారాయణ అన్నారు.
సినీ పరిశ్రమ ఒక పిచుకా అని చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదని అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
జాతీయ స్ధాయిలో చర్చించుకోవాలంటే పుంగునూరు ఘటనలా చేస్తారా..? అన్నటువంటి పవన్ వ్యాఖ్యలపై మాకు అదే అనుమానం కలుగుతోందని మంత్రి బోత్స అన్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోంబోమని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో వివిధ అంశాలపై చర్చించామని అన్నారు. వచ్చే వారం మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు కొనసాగుతాయి. పరీక్షా విధానాల్లో మార్పులు చేయాలని ఆలోచనచేస్తున్నామని చెప్పారు. ఎంఈఓ జాబ్ ఛార్ట్ ల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment