సాక్షి, అమరావతి: బషీర్ బాగ్ కాల్పుల ఘటనను చంద్రబాబు మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు చేస్తామంటే జనం నమ్ముతారా? అంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. పల్లెకు వెళితే జనాలు టీడీపీ వాళ్ల చొక్కాలు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
కరెంట్ ఛార్జీలు పెంచే పేటెంట్ రైట్ చంద్రబాబుదేనని.. ఆయన హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. జగనన్న శాశ్వత భూ హక్కు పై సమీక్షించామని.. అనుకున్న సమయంలోనే శాశ్వత భూ హక్కు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బ్రిటీష్ కాలం నాటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment