సాక్షి, హైదరాబాద్: రాష్ట బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలా?.. కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారాయన.. రాష్ట్ర బడ్జెట్ పెంచాలని అనుకున్నాం కానీ కేంద్రం నుంచి నిధులు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి సమభాగంలో బడ్జెట్ కేటాయింపులు జరిపామని మంత్రి అన్నారు.
వ్యవసాయ రంగానికి న భూతో న భవిష్యత్ అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్ ఎకో సిస్టం అభివృద్ధి కోసం 10వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టాం. భవిషత్ తరాలకు అవసరం అయ్యేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశాం.’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.
వ్యవసాయనికి 23వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే.. ఇప్పుడు 72వేల కోట్లు పెట్టాం. వట్టి మాటలు మేము చెప్పడం లేదు.. కేసీఆర్ చెప్పి వెళ్ళారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోంది అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టాం. మాకు ఒక విజన్ ఉంది.. 2004లో మహిళలను లక్షాధికారులను చేసి చూపాం. మేము అప్పులు తెచ్చి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నం. జులై వరకు 35వేల కోట్లు అప్పు చేసి 42వేల కోట్ల వడ్డీలు కట్టాం. రాష్ట్రం పై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే నిన్న ఎందుకు రాలేదు?. కేంద్రం నుంచి పిలుపు రాగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడి పోయారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని అడుగుతాం’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment