
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అబద్దాలు చెబితే జనం నమ్ముతారని బాబు అనుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా చలించే వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబు ఇల్లు కదలరు.. బయటకు రారు.. అంతా జూమ్‌లోనే. జూమ్ యాప్ ద్వారా ప్రజల మైండ్‌ను జామ్ చేద్దామనుకుంటున్నారా?. ఎల్లో మీడియా ద్వారా బురద చల్లాలని చంద్రబాబు తాపత్రయం. పంట నష్టంపై ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈనాడు లక్ష్యం. బాబు పార్టనర్ పవన్ ఫాంహైస్ నుంచి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. చంద్రబాబు పాలనలో కరువు తాండవించింది. సీఎం జగన్ పాలనలో పుష్కలంగా నీరు ఉంది. చంద్రబాబు జూమ్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో బడుగులు సంతోషంగా ఉన్నారని’’ మంత్రి పేర్కొన్నారు. (చదవండి: బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం)
భారత్ బంద్ అంశంలో ఎల్లో మీడియాలో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ వాళ్లు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయక పోగా ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతులకు అన్యాయం జరిగితే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. మోదీ అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు ఇప్పుడు నల్ల చొక్కా ఎందుకు వేసుకోలేదని’’ మంత్రి వేణుగోపాల కృష్ణ నిప్పులు చెరిగారు. (చదవండి: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు..)