
సాక్షి, విజయవాడ: గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో అదొక తుగ్గక్ చర్య అని విమర్శించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రెండు వేల నోట్ల రద్దు తన వల్లే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు కోసం మోదీని పొగుడుతుండటం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతుందన్నారు.
‘2000 నోట్ల రద్దు తన వల్లే అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని చంద్రబాబు గతంలో విమర్శించారు చంద్రబాబు. 2000 నోటు ఉపసంహరణ ను మా పార్టీ స్వాగతీస్తోంది. బీజేపీ తో పొత్తు కోసం మోడీ ని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నాడు. చంద్రబాబు అసహనంతో సీఎం జగన్ బట్టలు, చెప్పుల పై కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు కొడుకు, భార్య, కోడలు పై ఏనాడైనా సీఎం జగన్ విమర్శ చేశారా..?
చంద్రబాబు దిగజారి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు. లింగమనేని ఇంట్లో అద్దె కట్టకుండా చంద్రబాబు ఎందుకు ఉన్నాడు?, లింగమనేని, చంద్రబాబు ఇద్దరు ఈ ఇళ్ళు మాది కాదంటే మరి ఎవరిది..? అమరావతిని 50 వేల ఎకరాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లా చంద్రబాబు కలగన్నాడు.టీడీపీ, జనసేన కలిసినా సీఎం జగన్ను ఏమి చెయ్యలేరు. చంద్రబాబుని ఎప్పటికి ప్రజలు నమ్మరు’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.