
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని రైతుల సమస్యలపై బీజేపీ–జనసేన ఉమ్మడిగా ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలన్న దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం జనసేన అధ్యక్షుడిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి భేటీ అనంతరం ఉమ్మడిగా ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.
‘రైతులకు న్యాయం చేసేలా ఆలోచన’
రాజధాని అంశంలో కేంద్రం అఫిడవిట్ ఇచ్చినా అక్కడి రైతులకు పార్టీ పరంగా ఏ విధంగా న్యాయం చేయొచ్చన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. కాగా, సోము వీర్రాజు ఎంపీ సుజనాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, పార్టీ నేత సత్యకుమార్‌తో భేటీ అయ్యారు.