Perni Nani Comments On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్‌ కామెంట్స్‌

Oct 17 2022 4:24 PM | Updated on Oct 17 2022 6:33 PM

Perni Nani Comments On Pawan Kalyan - Sakshi

మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు. నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో భరణం ఇస్తున్నావ్..

సాక్షి, కృష్ణా జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్‌ గ్యాప్‌లో పవన్‌ విశాఖకు వెళ్లారు. విశాఖ నుంచి కదలనని ఎందుకు వెళ్లిపోయారు. పవన్‌కు చంద్రబాబు ప్రయోజనాలే కావాలి. విలువలు, నిబద్ధత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్‌ కౌంటర్‌

‘‘మీ కార్యక్రమాన్ని మేం ఆపలేదు, టీవీల నిండా, పేపర్ల నిండా  వార్తలు కావాలి. మళ్లి రేపటి నుండి షూటింగ్‌లకు వెళ్లిపోవాలి. పవన్‌కు 3 రోజులు షూటింగ్‌లో ఖాళీ దొరికింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద నిలబడడు. చంద్రబాబుకు ఒక శాపం ఉంది. ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అలాగే పవన్ కల్యాణ్‌కు మాట మీద నిలబడితే అదే శాపం ఇతనికి ఉందేమో’’ అంటూ పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు. నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో భరణం ఇస్తున్నావ్.. కాకపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని పవన్‌ను ఉద్దేశించి పేర్ని నాని హితవు పలికారు. ఇప్పటికైనా నిబద్దతతో, నీతితో కూడిన రాజకీయాలు చేస్తే శత్రువులు కూడా హర్షిస్తారు. మీ కార్యకర్తలే సిగ్గుపడే విధంగా ఎప్పుడు ఎవరి మాట భుజాన్న వేసుకుంటాడో, ఎవరిని నెత్తిన పెట్టుకుంటాడో తెలియని పరిస్థితి. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తిగా పవన్‌కు గుర్తింపు వచ్చింది’’ అని పేర్ని నాని  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement