
సాక్షి, ఢిల్లీ/ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో సీట్ల కేటాయింపు పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు సీటు ఇవ్వకపోవడం పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో కాకరేపుతోంది. దీంతో, కాషాయ పార్టీ నేతలు ఢిల్లీ బాటపడ్డారు.
కాగా, బీజేపీ తొలి జాబితాలో భాగంగా తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఇక, వారిలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు లేకపోవడంతో ఆయనను, పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. దీంతో, ఆయన హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ లిస్ట్‌లో కూడా తన పేరు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు.. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగష్ కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగేష్ చేరిక ఆదిలాబాద్ బీజేపీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. నగేష్‌ను బీజేపీలో చేర్చుకోవడాన్ని మెజారిటీ కమలం పార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నగేష్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు బీజేపీ నేతలు హస్తిన బాట పట్టారు. ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు, పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను వారు కలవనున్నారు.
ఇదే సమయంలో నగేష్ చేరికపై అభ్యంతరాలను ఆదిలాబాద్ బంజారా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా ఇటీవల చేరిన వారికి ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి సూచించారు. ఇక, బీఎల్ సంతోష్ ఇచ్చే సమాధానం బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment