సాక్షి, అమరావతి: రాజకీయాలపై ఏపీ ఫిలిమ్ కార్పొరేషన్ డైవలప్‌మెంట్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి, మాట్లాడాలన్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలు, చంద్రబాబు, పవన్ పాలిటిక్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను ఓడించేంత బలం పవన్‌కు లేదన్నారు. బాబు సీఎం అయితే హెరిటేజ్ సంపద పెరుగుతుంది.. రాష్ట్ర సంపద కాదని స్పష్టం చేశారు.
ఇక, పోసాని మీడియాతో మాట్లాడుతూ.. నేను విద్యార్ధి దశ నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచాను. యూనివర్సిటీలో విద్యార్థిగా నేను పనిచేశాను. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే నాకు వైఎస్సార్‌తో పరిచయం ఉంది. అందరూ వైఎస్సార్‌ను అభిమానిస్తారు. ఆరోజు నన్ను వైఎస్సార్ అభిమానించేవారు. వైఎస్సార్ చేసిన మంచి పనులతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజారెడ్డి ప్రజల కోసం చాలా మంచి పనులు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి కంటే గొప్పగా పరిపాలిస్తున్నారు. నేను ఆ మాట చెబితే సీఎం జగన్‌కు దిష్టి తగులుతుందని చెప్పాను.
టీడీపీ అధినేత చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలు ఆనాడు ఎన్టీఆర్‌నే వ్యక్తిత్వ హననం చేశారు. లక్ష్మీపార్వతిని ఓ బూచిగా చూపించి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు సీఎం జగన్‌పైన కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ వీళ్లెవ్వరికీ భయపడే వారు కాదు. అన్ని రకాల యాసిడ్ టెస్టులను కూడా జయించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్.
బాబు సీఎం అయితే హెరిటేజ్ సంపద పెరుగుతుంది..
నేను చదువుకున్నప్పటికి, ఇప్పటి స్కూళ్లకు తేడా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టే సీఎం జగన్‌కు మద్దతిస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెప్పే హామీలను ప్రజలు నమ్మరు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పిల్లలను కూడా పుట్టిస్తానని ప్రచారం చేయగలడు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్ర ప్రజలు భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్టే. చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా గతంలో నెరవేర్చాడా?. రైతులను, మహిళలను, యువతని ముంచేసిన వ్యక్తి చంద్రబాబు. ఒకవేళ బాబు సీఎం అయితే హెరిటేజ్ సంపద పెరుగుతుంది.. రాష్ట్ర సంపద కాదు.
కాపులు ఊరుకుంటారా పవన్?..
సీఎం జగన్‌ను ఓడించేంత బలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి లేదు. ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించేంత సత్తా పవన్‌కు ఉంటే చిరంజీవిని ఎందుకు సీఎం చేయలేకపోయాడు. కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేసి, వారికి నష్టం చేస్తున్నాడు. ముద్రగడ పద్మనాభాన్ని, కాపు నాయకులను పవన్ తిట్టం సమంజసమేనా?. గోదావరి జిల్లాల్లో పర్యటించి, కొన్ని సీట్లు తీసుకుని చంద్రబాబుకు అప్పగిస్తానంటే కాపులు ఊరుకుంటారా?. ముద్రగద కాపుల కోసం పదవులు కోల్పోయిన వ్యక్తి. అలాంటి ముద్రగడను పవన్ తిట్టించడం దారుణం అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment