లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో యూపీలో పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ యూపీ పర్యటనలో భాగంగా.. లక్నోలోని ఉత్తప్రదేశ్ ఇన్వెస్టర్స్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. గ్రౌండ్ బ్రేకింగ్ 4వ ఎడిషనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడారు.
గడిచిన 7 ఏళ్లలో యూపీలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని అన్నారు.రెడ్ టేప్ సంస్కృతి పోయి.. రెడ్ కార్పెట్ సంస్కృతి వచ్చిందని చెప్పారు. యూపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయని మోదీ తెలిపారు. భారత్‌లో అభివృద్ధిపై విదేశాల్లో చర్చ జరుగుతోందని అన్నారు.
అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి.. ఇది తమ గ్యారెంటీ అని మోదీ స్పష్టం చేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
చదవండి: Kalki Dham Temple: 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment