పీవీ మార్గ్‌లోని జైపాల్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ, ప్రధానిని ఒప్పించడంలో దివంగత మాజీ కాంగ్రెస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం పీవీమార్గ్‌లోని స్ఫూర్తి స్థల్ వద్ద పలు పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జేసీ దివాకర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్‌రెడ్డి, వినోద్, వివేక్, రాంచంద్రారెడ్డి, దయాకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు జైపాల్‌రెడ్డికి అంజ లి ఘటించారు. కాగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తిత్వం జైపాల్‌రెడ్డిదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment