రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్‌రూమ్‌లో సమావేశమైంది.
కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రోహిత్ చౌదరి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిగ్నేశ్ మేవానీ, సునీల్ కనుగోలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. భేటీలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజాముద్దీన్ దర్గాలో చాదర్ సమర్పణ
రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించారు. పార్టీ నేత అజారుద్దీన్‌తో కలసి చాదర్ సమర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకున్నామని చెప్పారు. మతసామరస్యాన్ని కాపాడే విధంగా పాలన అందించాలని కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. సెక్యులర్‌వాదిగా, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా దర్గాకు వచ్చానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment