షర్మిలకు స్క్రిప్ట్‌ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు: సజ్జల  | Sajjala Ramakrishna Reddy Key Comments Over Chandrababu | Sakshi
Sakshi News home page

షర్మిలకు స్క్రిప్ట్‌ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు: సజ్జల 

Published Thu, Mar 21 2024 2:17 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

Sajjala Ramakrishna Reddy Key Comments Over Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని అన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల చెప్పుకొచ్చారు. 

కాగా, సజ్జల గురువారం మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్‌ చేశారో​ స్పష్టంగా రాశారు. కేంద్ర, రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్‌గా చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్‌, బీజేపీని వాడుకుంటున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు.

షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్‌ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోంది. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి

  • చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారు
  • అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు చెడ్డ పేరు తెచ్చారు
  • వ్యవస్థలను అవినీతిమయం చేయటం, మీడియా ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టించటంలో చంద్రబాబు ఆరితేరారు
  • తన పాలనలో కేంద్ర, రాష్ట్ర నిధులను చంద్రబాబు మింగేశారు
  • చంద్రబాబు అంతటి అవినీతి పరుడు లేరని ప్రధాని సైతం విమర్శించారు
  • మరి ఆయనతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది?
  • నెగటివ్ శక్తులన్నీ కలిస్తే అది చంద్రబాబు
  • అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు
  • రాష్ట్రాన్ని అప్పడంలా నమిలి మింగేయటానికి చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు
  • చంద్రబాబు అవినీతి పరాకాష్ఠకు చేరినందునే 2019లో జనం ఓడించారు
  • ఐఎంజీ భారత్ పేరుతో చేసిన స్కాం ఇంటర్నేషనల్ క్లాసిక్ స్కాం అని తెలంగాణ హైకోర్టు సైతం అభిప్రాయపడింది
  • లక్ష రూపాయల పెట్టుబడితో వచ్చిన ఒక కంపెనీకి ఐదు రోజుల్లోనే 400 ఎకరాలను కేటాయించారు
  • వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే చంద్రబాబు ప్లాన్ చేశారు
  • అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం కూడా
  • అంతకుముందు కుప్పంలో ఇజ్రాయిల్ సాగు పేరుతో ఒక స్కాం చేశారు
  • నీరు-చెట్టు పేరుతో దోపిడీ చేశారు
  • జన్మభూమి కమిటీల దోపిడీ ఏ ఇంట్లో అడిగినా చెబుతారు
  • ఇలాంటి అవినీతిపరుల విషయంలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలి
  • షర్మిలకు స్క్రిప్ట్‌ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు

మహాదోపిడీ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు మాట్లాడుతూ.. 

  • చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది
  • దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి
  • రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు 
  • చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా
  • "స్కిల్ బిల్ పాండే" చంద్రబాబు
  • స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు
  • తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు 
  • సీఎం జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు 
  • చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement