లక్నో: ప్రియుని కోసం పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చిన సీమా హైదర్ ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్‌తో సహా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కూడా రాఖీలు పంపించింది. ఈ నెల 30న రాఖీ పండగ సందర్భంగా రాఖీలను పోస్టు చేసినట్లు తెలిపింది.
'ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు రాఖీలను పింపించాను. జై శ్రీరాం, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్.' అంటూ సీమా హైదర్ నినాదాలు చేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాగ్రౌండ్‌లో 'బయ్యా మేరే రాఖీ కె బంధన్ కో నిభానా' అనే సాంగ్ కూడా ప్లే అవుతోంది. సీమా తన పిల్లలతో కలిసి రాఖీ కడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
పబ్జీలో పరిచయమైన సచిన్ అనే యువకున్ని ప్రమించి అతని కోసం స్వదేశమైన పాక్‌ను దాటి వచ్చేసింది సీమా హైదర్. పిల్లలతో కలిసి దుబాయ్ మీదుగా నేపాల్ చేరి అటునుంచి ఉత్తరప్రదేశ్‌కి చేరింది. ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె తన ప్రియునితో కలిసి నోయిడాలో జీవిస్తోంది.
ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా..
Comments
Please login to add a commentAdd a comment