సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా నడుస్తోంది. పేరుకే కూటమి.. పెత్తనం మాత్రం బాబుదే. చంద్రబాబు చెప్పినట్టే పవన్ కూడా ఆడుతున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న జన సైనికులు నిరాశలో కూరుకుపోతున్నారు. జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే కేటాయించడం పట్ల జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి నేతలను చంద్రబాబు పంపించడం.. వారినే పార్టీలో చేర్చుకుని పవన్ సీట్లు ఇవ్వడం.. ఇదే తంతు.
నిన్న భీమవరం, నేడు తిరుపతి..
జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటును పవన్ ఖరారు చేశారు. ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరికి తిరుపతి అసెంబ్లీ సీటు ఖరారు చేశారు. నరసాపురంలోనూ ఇదే తంతు కొనసాగింది. టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారైంది. ఇదేం పొత్తు అంటూ పవన్‌పై జనసేన నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ సారి పొత్తులో జనసేనకు ఇచ్చిందే 24 అసెంబ్లీ స్థానాలు. ఇంత తక్కువ సీట్లు ఇవ్వడాన్ని జనసేన అభిమానులు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సోమవారం జరిగిన చర్చల్లో చంద్రబాబు జనసేనకు ఇచ్చే సీట్లలో 3 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానానికి కోత పెట్టేశారు. జనసేనకు మిగిలింది 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు. నామినేషన్ల సమయానికి ఇంకెన్ని కోత పడతాయో తెలియదు.
ఇదీ చదవండి: ఏపీ బీజేపీలో ముసలం.. సీనియర్ల ‘రహస్య’ భేటీ
Comments
Please login to add a commentAdd a comment