ఏపీ సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు | Telangana CM KCR Admires AP CM Jagan | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

Published Sun, Oct 15 2023 2:48 PM | Last Updated on Sun, Oct 15 2023 3:23 PM

Telangana CM KCR Admires AP CM Jagan - Sakshi

హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకంగా ఏపీలో పెన్షన్‌ అమలవుతున్న తీరును కొనియాడారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఏపీలో పెన్షన్‌ స్కీమ్‌ చాలా విజయవంతంగా జరుగుతుందన్న సీఎం కేసీఆర్‌.. ప్రధానంగా ప్రతీ ఏడాది పెన్షన్‌ పెంచుకుంటూ వెళ్లే విధానం ఏపీలో చాలా అద్భుతంగా అమలవుతోందన్నారు. అదే తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

ఆదివారం బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్‌.  ఈ క్రమంలోనే పలు పథకాలను బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలు చేర్చుతున్నట్లు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ప్రతీ ఏడాది పెన్షన్‌ పెంచే పద్ధతిని అవలంభించాలనేది కూడా మేనిఫెస్టోలో పెడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో అమలవుతున్న పెన్షన్‌ విధానాన్ని ప్రస్తావించారు సీఎం కేసీఆర్‌.  ప్రతీ ఏడాది ఇలా పెన్షన్‌ పెంచుకుంటూ వెళ్లే విధానం నిజంగానే అద్భుతమన్నారు.  సీఎం జగన్‌ పాలనలో ఏపీలో విజయవంతమైన ‘ప్రతీ ఏడాది పెన్షన్‌ పెంపు’ను తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌.

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement