సాక్షి, అమరావతి : విశ్వసనీయత లేని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని వైఎస్సార్‌సీపీ కోఆరి్డనేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పార్ట్–1ను ప్రజలు విశ్వసించరని చెప్పారు.
2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానిని ఆయన అమలుచేయకుండా ప్రజల్ని మోసం చేశారని.. దీనిని వారు ఎప్పటికీ మరిచిపోరన్నారు. కానీ, ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం జగన్‌పై ప్రజల్లో నమ్మకం రెట్టింపైందని.. 2024లో ప్రజాబలంతో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
అభివృద్ధి పథంలో అగ్రగావిుగా..
సంక్షేమ పథకాల ద్వారా నాలుగేళ్లలో లంచాలకు తావులేకుండా.. పారదర్శకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల ఖాతాల్లో రూ.2.16 లక్షల కోట్లను సీఎం జగన్ జమచేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలుచేశారా? విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా ముఖ్యమంత్రి జగన్ నిలిపారు. ఇది ప్రజల్లో ఆయనపై విశ్వసనీయతను మరింతగా పెంచింది.
మేనిఫెస్టో కాదు మాయాఫెస్టో..
కర్ణాటక ఎన్నికలు ముగియగానే అక్కడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న పథకాలను కలిపి కిచిడి తయారుచేసి మహానాడులో మేనిఫెస్టో పార్ట్–1ను చంద్రబాబు విడుదల చేశారు. డిసెంబర్‌లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికల తర్వాత అక్కడ పార్టీలు పెట్టిన మేనిఫెస్టోను కాపీకొట్టి మేనిఫెస్టో పార్ట్–2ను ఆయన విడుదల చేస్తారేమో? అసలు చంద్రబాబు విడుదల చేసింది మేనిఫెస్టో కాదు.. అది ఓ మాయాఫెస్టో.
అవినీతికి ఒక్క ఆధారమైన చూపగలిగారా?
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ జాతీయ నేతలు ఇటీవల చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారమైన చూపగలిగారా? రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు నెరుపుతుంది. విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటు కింద ఇవ్వాల్సిన నిధులను సీఎం జగన్ పదేపదే కోరడంతోనే కేంద్రం స్పందించి రూ.10,460 కోట్లను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకుని పోటీచేసినా ప్రజాబలంతో వైఎస్సార్‌సీపీనే విజయం సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment