
చంద్రబాబు ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన గుంటూరు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నైజం ఏంటో ప్రజలకు బాగా తెలుసు. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే కాదు.. నటుడిగానూ అసమర్థుడు. సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి బాలకృష్ణకు లేదన్నారు.
చదవండి: ‘ఆ దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయింది’
‘‘బాలకృష్ణ లాంటి మెదడు లేని వ్యక్తి ఈ దేశంలోనే లేడు. పప్పు నాయుడికి దమ్ముంటే అవినీతిని బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్‌లే అవినీతి, కుంభకోణాలు చేశారని దుయ్యబట్టారు. అవినీతి చేసినందుకే 2019లో ప్రజలు బుద్ధి చెప్పి పంపారని విజయసాయిరెడ్డి అన్నారు.