‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.
‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.
- 2014 ఎన్నికల ముందు అప్పుడు TDP అధికారంలో వస్తే డ్వాక్రా రుణాలన్నీ భేషరత్తుగా మాఫీ చేస్తానని హామీ అధికారంలోకి వచ్చాక ఏ ఓక్కరికీ మాఫీ చేయని మాట వాస్తవం కాదా?
- అప్పటి సంబంధిత శాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయాన్ని లిఖితపూర్వంగా ఏకంగా అసెంబ్లీలోనే ఒక ప్రశ్నకు జవాబు చెప్పిన మాట నిజం కాదా?
- అదే జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అప్పటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న అప్పు మొత్తం నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా ఆయా మహిళలకే అందించింది వాస్తవం కాదా?
- 2014–19 మధ్య గ్రామాల్లో సర్పంచి, ఎంపీటీసీ పదవులో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేతలందరితో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసింది వాస్తవం కాదా. ఆ జన్మభూమి కమిటీ ముసలి అవ్వాతాత పింఛనుదారుల సహా లక్షల మంది పేదలు అర్హత ఉండీ ఆ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోలేక అప్పటి మీ ప్రభుత్వం అందించే అరకొర పథకాల సాయం కోల్పోయింది నిజం కాదా?
- ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా ముందే ప్రకటించే సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఎలాంటి పైరవీలు, పక్షపాతం, పార్టీలకు సంబంధం లేకుండా (టీడీపీ నాయకుల ఇళ్లకు సైతం), అవినీతి తావులేకుండా వలంటీర్ల ద్వారా అందించిన మాట వాస్తవం కాదా?
- వలంటీర్లు ద్వారా ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అవ్వాతాతల ఇంటి వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్లు పంపిణీ అందజేస్తుండడం ద్వారా ఆ ముసలివాళ్ల కళ్లలో కనిపించే ఆనందం నిజం కాదా?
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-5)
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-4)
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-3)
Comments
Please login to add a commentAdd a comment