సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీదే గెలుపని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి ఇప్పుడున్న సీట్లు కూడా రావు అని తెలిపారు. కర్మ పేరుతో చంద్రబాబు తన కర్మ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల నాదే అని చెప్తున్నారు.. ఏమైంది అని ప్రశ్నించారు. అమరావతిలో సొంత వ్యాపారం కోసమే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రజల కోపాన్ని చంద్రబాబు చవిచూసారన్నారు. మంగళగిరిలో ఓడిన లోకేష్ పాదయాత్ర చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు.
చదవండి: (Hyderabad: రాంగ్‌సైడ్, ట్రిపుల్ రైడింగ్‌కు ఇక బాదుడే)
Comments
Please login to add a commentAdd a comment