
సాక్షి, ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దోపిడీ, మోసం.. దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సంపద సృష్టి లేదు.. ఏదీ లేదు అంటూ సెటైర్లు వేశారు. అలాగే, బాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సంపద సృష్టి లేదు-40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు.. అంతా దోపిడీనే!!. మళ్ళీ 3000 వేలకోట్ల అప్పు. ఎక్కడకి పోతుంది ఈ డబ్బు అంతా?. కార్పోరేషన్స్‌కి గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేలకోట్ల పై మాటే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించాక, ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7000 కోట్లు. అది కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉంది.
పిల్లలు తినే గోరుముద్దతో సహా వైఎస్ జగన్ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడవడం లేదు. పాత బిల్లులు చెల్లించడం లేదు. 7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక 10 రోజుల క్రితమే పంపినా, ఇప్పటి వరకు సాయం గురించి ప్రకటన రాలేదు. దోపిడీ .. దోపిడీ .. దోపిడీ.. మోసం..మోసం.. మోసం.. దగా.. దగా..దగా’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: దేవుడా.. ఏపీని రక్షించు!
Comments
Please login to add a commentAdd a comment