తూర్పు గడ్డపై ఫ్యాన్‌ హోరు | YSRCP Won 15 Out Of 19 Assembly Seats At East Godavari District In 2024 Elections, Details Inside | Sakshi
Sakshi News home page

AP Assembly Elections 2024: తూర్పు గడ్డపై ఫ్యాన్‌ హోరు

Published Tue, May 7 2024 12:58 AM | Last Updated on Tue, May 7 2024 11:20 AM

YSRCP won 15 out of 19 assembly seats at East Godavari district in 2024 Elections

తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్‌ (ఫైల్‌)

ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న శ్రేణులు

గెలుపు దిశగా అడుగులు 

ఈసారి క్లీన్‌ స్వీప్‌ ఖాయం

జావగారిపోయిన టీడీపీ, జనసేన  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్‌ జోరుగా తిరుగుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూర్పు గడ్డపై వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో బలంగా ఉందనుకున్న జనసేనపై నమ్మకం సడలి ఆ పార్టీ నేతలు జారుకోవడం, టీడీపీ ఆదరణ కోల్పోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది.

పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ స్థానాల్లో 15 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కన్నబాబు కన్నుల్లో ఆనందమే 
రెండుసార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధితో తనదైన ముద్ర వేసుకున్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడకే.  వివాదరహితుడు, అందరితో కలిసిపోయేతత్వం ఈయనకు సానుకూల అంశాలు. ఆయన స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసినప్పుడు 40 వేల ఓట్లు పైచిలుకు సాధించిన రికార్డు ఉంది. జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావుపై పలు స్టేషన్లలో 19 కేసులున్నాయి. దీంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.  

ప్రత్తిపాడులో ఫ్యాన్‌ పవర్‌ 
ప్రత్తిపాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ నిలిచారు. వీరిద్దరూ వరుసకు తాత, మనవరాలు. సీనియర్‌ నాయకుడు కావడం, వివాదరహితుడనే పేరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సుబ్బారావుకు కలిసి వచ్చే అంశాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండటం సుబ్బారావుకు ప్లస్‌ పాయింట్‌. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బరిలో నిలిచిన సత్యప్రభకు రాజకీయాలు కొత్త. పారీ్టలో తన భర్త దివంగత రాజాతో విభేదాలున్న వర్గం సత్యప్రభకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం ప్రతికూలాంశం.

కాకినాడ మరోసారి కేక
కాకినాడ సిటీ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హ్యాట్రిక్‌ విజయం దిశగా పయనిçస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాకినాడలో దాదాపు అన్ని వర్గాల సాన్నిహిత్యంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్మార్ట్‌ సిటీ నిధులతో సుందర నగరంగా తీర్చిదిద్దడం, ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం, ముక్కుసూటితనం ద్వారంపూడికి మూడోసారి గెలుపునకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ద్వారంపూడికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు సొంత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత, టీడీపీలో గ్రూపుల గోలతో ఎదురీదుతున్నారు. 

‘తోట’కే విజయ ఫలం
పూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంపేట. రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేచింది ఇక్కడ. వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరు 2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేటలో పాత ప్రత్యర్థులే. ఈ రెండుసార్లు కూడా తోటదే గెలుపు. మూడోసారి మళ్లీ  తలపడుతున్నారు. మహానేత వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా తోట చేపట్టిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు నరసింహంకు సానుకూలత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి నెహ్రూకు పారీ్టలోని వ్యతిరేక వర్గంతోపాటు జనసేన రెబల్‌గా బరిలో ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు తోడుకావడం మైనస్‌.

జగ్గిరెడ్డిని ఆపతరమా..? 
కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యనే మరో సారి పోరు సాగుతోంది. వైఎస్సార్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోను వీరిద్దరే ప్రత్యర్థులు. 2009లో తప్ప మిగిలిన అన్నిసార్లూ చిర్లదే గెలుపు. జగ్గిరెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించేందుకు సానుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిర్ల గెలుపు వాకిట ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు పొత్తుతోనే చిత్త య్యే వాతావరణం కనిపిస్తోంది.  

పిఠాపురంలో పవన్‌కు భంగపాటే... 
అపజయం ఎరుగని రాజకీయ నాయకురాలిగా పేరున్న సిట్టింగ్‌ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్‌ పిఠాపురం బరిలో నిలిచారు. 2009లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా పేరుంది. నియోజకవర్గంలో ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి పరిచయాలున్న గీతతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీపడుతున్నారు. తనకున్న పరిచయాలు, కలుపుగోలుతనం, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవంతో పిఠాపురంలో పవన్‌కు చుక్కలు చూపిస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎన్నికలప్పుడు కనిపించి తరువాత ముఖం చాటేస్తారనే భయం ఉంది.  

‘పెద్ద’రికానికి బ్రేకు తప్పదు 
పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు టీడీపీ వరుస విజయానికి బ్రేక్‌ వేసే వైపు అడుగులేస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి  దొరబాబు చేసిన కృషి విజయం వైపు నడిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి ఆశాభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్ర తిరగేసి చూస్తే పెద్దాపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక్కడి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన చినరాజప్ప ఈ సారి తప్పకుండా ఓటమి చవిచూస్తారని అంటున్నారు. 

తునిలో టీడీపీ తూర్పుకు దండమే  
తూర్పు సెంటిమెంట్‌ నియోజకవర్గం తుని. రెండు, మూడు సందర్భాలు మినహాయిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పారీ్టనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఉంది. మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్‌ కొట్టాలని వైఎస్సార్‌సీపీ అభ్యరి్థ, సిట్టింగ్‌ మంత్రి దాడిశెట్టి రాజా ధీమాగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సాయం అర్థించి వస్తే కాదనలేని మనస్తత్వం రాజాను గెలిపిస్తుంది. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె దివ్యను బరిలోకి దింపినా ఎదురీదక తప్పడం లేదు. రామకృష్ణుడు మోసానికి గురైన తమ్ముడు కృష్ణుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరడంతో గెలుపు మరింత సులువైంది.  

కమలానికి కంటి తడి తప్పదు 
రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యరి్థగా డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ బరిలోకి దిగగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీపడుతున్నారు. చేయి తిరిగిన వైద్యుడిగా పేరొందిన శ్రీనివాస్‌ను బలహీనవర్గాల కోటాలో ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల మద్ధతుతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.స్థానికులను కాదని పురందరేశ్వరికి బీజేపీ సీటు కేటాయించడంతో కమళనాథుల కుమ్ములాటలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకునే నేతలకు పట్టంకడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది గతంలో సినీ నటుడు మురళీమోహన్‌ విషయంలో చూసిన ఈ ప్రాంత జనం పురందరేశ్వరి అభ్యరి్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

‘బుచ్చిబాబు’ను వెంటాడుతున్న పాపాలు 
ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎదురీదుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు అతని అనుచరగణం సాగించిన అరాచకాలు, సెటిల్‌మెంట్లు ఈ ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. నాడు చేసిన తప్పులు ఇప్పుడు కొద్దోగొప్పో బాగుందనుకుంటున్న పార్టీకి మైనస్‌గా మారాయి. సమస్యల పరిష్కారంలో సామాజికంగా కొన్ని పక్షాలను దూరం పెట్టిన ప్రభావం ఇప్పుడు వ్యతిరేకతగా మారి ఓటమి అంచులకు చేరుస్తోందని ఆ వర్గాలే భావిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్‌కు బలమైన రెండు సామాజికవర్గాల మద్దతుతో ఈసారి కూడా గెలుపు సునాయసమేనని విశ్లేíÙస్తున్నారు.  

సునీల్‌..గెలుపు జిగేల్‌  
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది.వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌తో జనసేన అభ్యర్థి టీటైమ్‌ అధినేత తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ పోటీపడుతున్నారు. సునీల్‌కు మెట్ట ప్రాంత మండలాల్లో పారీ్టరహితంగా నేతలతో ఉన్న బంధుత్వాలు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. సునీల్‌తో పోటీపడుతోన్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ స్థానికేతరుడు, కనీస పరిచయాలు లేకపోవడం ప్రతికూలతగా మారింది. మిత్రపక్షం టీడీసీలో అంతర్గత కుమ్ములాటలు, వారి నుంచి ఎదురవుతోన్న సహాయనిరాకరణతో ఎదురీదుతున్నారు.  

గొల్లపల్లి గుప్పెట్లో రాజోలు 
ఎమ్మెల్యే, మంత్రిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం, ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు, రాజోలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయావకాశాలకు ఢోకా లేకుండాపోతోంది. గతంలో గొల్లపల్లి చేసిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు, వందేళ్లుగా జరగని సఖినేటిపల్లి– నర్సాపూర్‌ వంతెన నిర్మాణం కోసం రూ.580 కోట్లు కేటాయింపు సానుకూల అంశాలై  గెలుపు ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్‌ ఈ ప్రాంతంతో పరిచయం లేకపోవడంలో ఓటమి ఖరారుగా కనిపిస్తోంది.  

అనపర్తి సత్తికి కంచుకోట 
అనపర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కంచుకోటగా మరోసారి నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలనకుతోడు అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించిన సత్తికి గెలుపు సునాయాసమేనంటున్నారు. ఓటమి ఖాయమనే సర్వే నివేదికలతో వెనక్కు తగ్గిన టీడీపీ, బీజేపీని బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి పోటీకి పెట్టింది. ఈ పరిణామాలతో విస్తుపోయిన ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు.  

అమలాపురంలో ‘దేశం’ సర్దుకోవలసిందే  
అమలాపురం నియోజకవర్గంలో మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌ గెలుపు బాటలో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సీనియర్‌గా అన్ని వర్గాలతో మమేకం కావడం, అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో విశ్వరూప్‌ విజయానికి ఢోకా లేదు. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ప్రజలతో పెద్దగా మమేకమవకపోవడం ప్రతికూలతగా మారింది. సొంత పారీ్టలోనే కాకుండా కూటమిలోని జనసేన నేతలు కూడా తెరవెనుక వ్యతిరేకంగా పనిచేస్తుండటం మైనస్‌.

‘రాజా’నగరమే 
ఇక్కడ వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్యరి్థగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీపడుతున్నారు. రూ.1773 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1377 కోట్లతో అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని పలువురిని మోసం చేయడం వంటి కేసులుండటంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేనతో జతకట్టిన టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత బలరామకృష్ణకు ప్రతికూల అంశం. బలరామకృష్ణ ఏకైక నమ్మకం పవన్‌ సామాజికవర్గం.

రామచంద్రపురంలో వైఎస్సార్‌సీపీ రయ్‌..రయ్‌ 
రాజకీయ దురంధరుడైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రామచంద్రపురం బరిలోకి దిగిన అతని తనయుడు, విద్యావంతుడు పిల్లి సూర్యప్రకాశ్‌ విజయానికి చేరువలో ఉన్నారు. స్థానికుడు, తండ్రి బోస్‌ ద్వారా గ్రామ,గ్రామాన ఉన్న విస్తృతమైన పరిచయాలు సానుకూల అంశాలు.  బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు చెందిన బలమైన సామాజిక వర్గాలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వైఎస్సార్‌సీపీ పక్షాన నిలవడం ప్లస్‌ పాయింట్‌. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ స్థానికేతరుడు, నేరచరిత్ర, అమలాపురం పరిసరాల్లో ఉన్న కేసులు, జనసేన నుంచి సహాయ నిరాకరణ ప్రతికూల అంశాలు.

మార్పు కోరుతున్న ‘రూరల్‌’ 
రాజమహేంద్రవరం రూరల్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆ«ధిపత్య సామాజిక వర్గానికి చెందిన గోరంట్లపై బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన గోరంట్ల ఇక్కడ మూడోసారి తలపడుతుంటే, నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమితులై ప్రగతికి శ్రీకారం చుట్టడంతో వేణుకు బ్రహ్మరథం పడుతున్నారు.  

వైఎస్సార్‌సీపీకి ప్రసాదమే  
అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో ఉన్న రాజోలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఫ్యాన్‌గాలి బలంగా వీస్తోంది. దేశంలో ఎస్సీ సామాజికవర్గం బలంగా ఉన్న రెండో పార్లమెంటు స్థానం అమలాపురం కావడం, ఆ సామాజికవర్గం ముద్ర వైఎస్సార్‌సీపీపై బలంగా ఉండటంతో కలిసి వచ్చే అంశం. రాపాకకు ప్రత్యరి్థగా టీడీపీ నుంచి పోటీచేస్తోన్న గంటి హరీ‹Ùమాధుర్‌కు రాజకీయాలపై పెద్దగా అవగహన లేకపోవడం మైనస్‌. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వర్గవైషమ్యాలు హరీ‹Ùకు ప్రతికూలంగా ఉన్నాయి.

మండపేటలో వేగుళ్ల ఎదురీత
మండపేటలో ఈ సారి వైఎస్సార్‌సీపీ దెబ్బకు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోకవర్గంలో తొలిసారి టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బరిలోకి దిగారు. సొంత సామాజికవర్గంతోపాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి టీడీపీని కాదని కలిసి వస్తుండటం సానుకూలంగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు.  

వేణుకు ‘వరమే’
మృదు స్వభావి, నీటి పారుదల ఇంజనీర్‌గా రైతులకు చేసిన సేవలు పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యరి్థ, జడ్పీ చైర్‌పర్సన్‌ విప్పర్తి వేణుగోపాలరావును గెలుపు తీరానికి చేరుస్తున్నాయి. వివాదరహితుడు, విద్యావంతుడు, జడ్పీ చైర్మన్‌గా ఈ ప్రాంతాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర, స్థానికుడు కావడం తదితర అంశాలు గెలుపునకు సానుకూలంగా మారాయి. ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికేతరుడు కావడం మైనస్‌గా ఉంది. పొత్తు సమన్వయం లేకపోవడం, ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో గిడ్డికి ఎదురుగాలి వీస్తోంది.

రాజమండ్రి సిటీలో సీటు చిరిగిపోయినట్లే  
రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎదురీదుతోంది. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే వైఎస్సార్‌సీపీ అభ్యరి్థ, సిటింగ్‌ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను గెలుపు బాటలో పయనింపచేస్తున్నాయి. కళ్లెదుట కనిపిస్తున్న సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన నగర సుందరీకరణ భరత్‌కు సానుకూలంగా మారింది. నగరంలో దశాబ్దన్నర కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న ప్రత్యరి్థ, టీడీపీ అభ్యరి్థగా ఆదిరెడ్డి వాసుపై నెలకొన్న అసంతృప్తే అతనికి మైనస్‌గా మారింది. తల్లి నగరపాలక సంస్థ మేయర్‌గా, భార్య భవానీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నగరాభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడంతో వాసుకు ప్రతికూలంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement