మల్కాపూర్‌లో పెద్దపులి సంచారం?
బోయినపల్లి(చొప్పదండి):మండలంలోని మ ల్కాపూర్లో గల గుడ్డేలుగుల గుట్ట పరిసరాల్లో పెద్దపులి కనిపించిందన్న విషయం కలకలం రే పింది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో వేములవాడ ఎఫ్ఆర్వో ఖలీలొద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం రా త్రి మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గుడ్డేలుగుల గుట్ట పరిసరాల్లో పులి ఆనవాళ్ల సేకరణ కు ప్రయత్నిస్తున్నారు. గుట్ట పరిసరాల్లో పులి కని పించడంతో ఓ వ్యక్తి వీడియో తీశాడు. వీడియోలో స్పష్టంగా కనిపించడం లేదు. కాగా బుధవా రం పులి అడుగులు, ఆనవాళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎఫ్ఆర్వో తెలిపారు. జగిత్యా ల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లంచెరువు పరిసరాల్లో పులి సంచారం ఉందని తెలిపారు. అక్కడి నుంచి మల్కాపూర్ గుట్ట వరకు 5 కిలో మీటర్ల మేర దూరం ఉండడంతో పులి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎఫ్ఎస్వో అఫ్జల్హుస్సేన్, అభిశేక్రావు, ప్రసాద్ ఉన్నారు.
గ్రామాల్లో అటవీశాఖ ప్లెక్సీలు
చందుర్తి (వేములవాడ): చందుర్తి, మల్యాల రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని హెచ్చరికలు చేస్తూ అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లెక్సీలు వెలిశాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పులికి హాని తలపెట్టవద్దని కోరారు. పులి సంచరించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎఫ్ఆర్వో, డీఆర్వోల సెల్ నంబర్లు ప్లెక్సీలో ముద్రించారు. కాగా పులి సంచారంతో ఆయా గ్రామాల్లోని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment