దొరకని పులి ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

దొరకని పులి ఆనవాళ్లు

Published Thu, Jan 30 2025 12:11 AM | Last Updated on Thu, Jan 30 2025 12:11 AM

దొరకన

దొరకని పులి ఆనవాళ్లు

బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం మల్కాపూర్‌ గుడ్డేలుగులగుట్ట పరిసరాల్లో పెద్దపులి కనిపించిందన్న సమాచారంతో అటవీశాఖ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పులి ఆనవాళ్లు ఏమీ దొరకలేదని వేములవాడ ఎఫ్‌ఆర్‌వో ఖలీలొద్దీన్‌ తెలిపారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గుట్ట పరిసరాల్లో, గుట్టపైన గాలించినట్లు తెలిపారు. పులి లెగ్‌మార్క్స్‌ ఎక్కడా లభించలేదని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లంచెరువు పరిసరాల్లో పులి సంచారం ఉందని ఓ లేగదూడను చంపిన విషయం తెలిసిందన్నా రు. బొల్లంచెరువు నుంచి మల్కాపూర్‌ గుట్ట వరకు 5 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఎఫ్‌ఎస్‌వో అఫ్జల్‌హుస్సేన్‌, అభిషేక్‌రావు, ప్రసాద్‌ ఉన్నారు.

జిల్లా పంచాయతీ అధికారిగా రవీందర్‌

సిరిసిల్ల: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా ఎనగందుల రవీందర్‌ను నియమి స్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్‌టీ నంబరు 84 (తేదీ:29.01.2025)ని బుధవారం జారీ చేసింది. కరీంనగర్‌ డీపీవోగా ఉన్న రవీందర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా డీపీవోగా బదిలీ చేశారు. డీఆర్‌డీవోగా పని చేస్తున్న శేషాద్రి ఇన్‌చార్జి డీపీవోగా పని చేస్తున్నారు. గతంలో డీపీవోగా పని చేసిన వీరబుచ్చయ్యను పెద్దపల్లికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. గత ఆరు నెలలుగా ఇన్‌చార్జి డీపీవోగా శేషాద్రి కొనసాగారు.

దళితుల నివాసాల్లో విద్యుత్‌ తొలగింపు

విప్‌ ఆది శ్రీనివాస్‌ జోక్యంతో పునరుద్ధరణ

సిరిసిల్లటౌన్‌: మాఘ అమావాస్య పండుగ పూట విద్యుత్‌ అధికారులు దాష్టీకానికి తెగబ డ్డారు. పదిహేనేళ్ల క్రితంనాటి బకాయిలు చెల్లించాలంటూ దళితవాడల్లో కొందరి విద్యు త్‌ సర్వీసులు తొలగించారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. అంబేద్కర్‌నగర్‌కు చెందిన కొందరు దళితులు కరెంటు బిల్లులు బకాయి పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదల బిల్లులు మాఫీ అవుతాయంటే చెల్లించలేదన్నారు. తర్వాత ప్రభుత్వాలు మారాయి. సెస్‌ పాలకవర్గాలు మారాయని, బుధవారం సెస్‌ అధి కారులు తమఇళ్లలోకి వచ్చి కరెంటు కనెక్షన్లు తొలగించారన్నారు. గంగాభవాని జాతర పూట కరెంటు తొలగించవద్దని వేడుకున్నా.. సెస్‌ డీఈ సుబ్బారెడ్డి, ఏఈ, హెల్పర్‌ తమ ఇండ్లకు కరెంటు కనెక్షన్లు తొలగించారన్నారు. విషయాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు వివరించగా ఆయన జోక్యంతో కనెక్షన్లు పునరుద్ధరించారు. సెస్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులొచ్చి పదుల సంఖ్యలో ఇండ్లలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు కాలిపోయాయి. పండుగ పూట జరిగిన ఈ దాష్టీకంపై గురువారం ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దొరకని పులి ఆనవాళ్లు
1
1/1

దొరకని పులి ఆనవాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement