విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు
● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సెస్, చేనేత జౌళి అధికారులతో సమీక్ష ● హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దని, మెరుగైన విద్యుత్ అందించాలని వ్యవసాయ, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో బుధవారం ఆయన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు, పవర్లూమ్ పరిశ్రమకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలని మంత్రి సూచించారు. చేనేత అభయహస్తం పథకాన్ని ప్రణాళికబద్ధంగా అమలు చేయాలన్నారు. యారన్ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. జీవో నంబరు01, (తేదీ:18.03.2024) ప్రకారం ప్రభుత్వశాఖలకు అవసరమైన వస్త్రాల ఇండెంట్‌ను టెస్కోకు సమర్పించాలన్నారు. సిరిసిల్ల ‘సెస్’, చేనేత జౌళిశాఖ అంశాలపై మంత్రి నాగేశ్వరరావుకు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి వినతిపత్రమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment