మున్సిపల్ వాహనాలకు ‘జీపీఎస్’
సిరిసిల్ల: మున్సిపల్ వాహనాలకు ‘జీపీఎస్’ ట్రాక ర్లు అమర్చాలని, ప్రభుత్వబంకుల్లోనే వాటికి డీజిల్ పోయించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులతో బుధవా రం ప్రత్యేక అధికారి హోదాలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బందికి తన అనుమతి లేనిదే సెలవులు మంజూరు చేయరాదన్నారు. పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలన్నారు. పారిశుఽ ద్య సిబ్బంది హాజరు పక్కాగా నమోదు జరగాలని, చెత్త సేకరణ పక్కగా చేయాలన్నారు. ట్రెడ్ లైసెన్స్, వాటి రెన్యువల్స్, వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజు లను మరోసారి పునఃపరిశీలించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతీ వ్యాపారి నుంచి ట్రెడ్ లైసెన్స్ ఫీజులు, వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలన్నారు. నూతన భవన నిర్మాణాల, లేఔట్ అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నా రు. బైపాస్ రోడ్డు పక్కన ఉండే పిచ్చి మొక్కల తొలగించాలని సూచించారు. మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టిన అభివద్ధి పనులను సమీ క్షించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీ సుకోవాలని, అనుమతి లేని నిర్మాణాలకు ఆస్కా రం ఇవ్వొద్దన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని స్పష్టం చేశారు. మునిసిపల్ కమిషనర్ లావణ్య, రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్రాయ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పర్యావరణ ఇంజినీర్ రఘు పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment