బోయినపల్లి(చొప్పదండి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేయనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5,6వ తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎస్ఎఫ్ఐ 4వ మహాసభల కరపత్రాలను మంగళవారం మండలకేంద్రంలోని మోడల్స్కూల్లో ఆవిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేశ్, బుర్ర ఉదయ్, గుండ్ల ఆర్యన్, కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి భార్గవరామ్, కాసారం శ్రీనాథ్, రమ్య, శృతి, భార్గవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment