మరింత ‘సహకారం’ | - | Sakshi
Sakshi News home page

మరింత ‘సహకారం’

Published Wed, Jan 29 2025 12:23 AM | Last Updated on Wed, Jan 29 2025 12:22 AM

మరింత ‘సహకారం’

మరింత ‘సహకారం’

● కొత్త సొసైటీలకు ప్రతిపాదనలు ● జిల్లాలో ఇప్పటికే 24 సహకార సంఘాలు ● తాజాగా 9 ఏర్పాటుకు ప్రతిపాదనలు ● కొత్త మండలాల్లో అవకాశం

చందుర్తి(వేములవాడ): జిల్లాలో సహకార సంఘాల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 24 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా.. కొత్తగా తొమ్మిది ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని కొత్త మండలాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు అండగా సంఘాలు

జిల్లాలోని సహకార సంఘాలు రైతులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్నాయి. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడం, పెట్రోల్‌బంకుల ద్వారా లాభాలు ఆర్జించడం, కోఆపరేటీవ్‌ బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇవ్వడం వంటి సేవలు అందిస్తున్నాయి.

33కు చేరుకోనున్న సంఘాలు

జిల్లాలో ఇప్పటికే 24 సొసైటీలు ఉండగా, ప్రస్తుతం నూతనంగా మరో 9 సంఘాల ఏర్పాటు అయితే వాటి సంఖ్య 33కు చేరుకోనుంది. గతంలో నష్టాలబాటలో ఉన్న కొన్ని సంఘాలను మూసివేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి సాధించాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని సంఘాలు లాభాలబాటలో నడుస్తున్నాయి.

ప్రతిపాదనలు ఇలా..

మండలం గ్రామం

ఇల్లంతకుంట కందికట్కూర్‌

రుద్రంగి రుద్రంగి

కోనరావుపేట నిమ్మపల్లి

వీర్నపల్లి వీర్నపల్లి

చందుర్తి నర్సింగపూర్‌

తంగళ్లపల్లి బద్దెనపల్లి

వేములవాడ చెక్కపల్లి

తంగళ్లపల్లి తంగళ్లపల్లి

ఇల్లంతకుంట పెద్దలింగాపూర్‌

ప్రతిపాదనలు పంపాం

జిల్లా రైతులకు పీఏసీఎస్‌ సేవలను మరింత చేరువ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో 9 సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు వస్తే జిల్లాలో 33 సంఘాలు కానున్నాయి. – రామకృష్ణ,

జిల్లా సహకార సంఘం అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement