ఏఈవో హరికిషన్‌కు పర్యవేక్షకుడిగా రివర్షన్
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో పని చేసి ఇటీవలే సాధారణ బదిలీల్లో ముందుగా భద్రాచలం, తర్వాత యాదగిరిగుట్టకు ఏఈవోగా బదిలీపై వెళ్లిన ఎస్.హరికిషన్ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో ప్రమోషన్ పొందిన అంశంలో ఏఈవో నుంచి పర్యవేక్షకుడిగా రివర్షన్ చేస్తూ యాదగిరిగుట్ట ఈవో ఈనెల 18న ఉత్తర్వులు వెలువరించారు. గతంలో పొందిన ఏఈవో ప్రమోషన్ రద్దు చేసి పర్యవేక్షకుడిగా కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కాపీని వేములవాడ రాజన్న ఆలయ ఈవోకు సైతం పంపించినట్లు సమాచారం.
ఇంకా దొరకని ఆచూకీ
ఫేక్ సర్టిఫికెట్తో ప్రమోషన్ పొందిన ఏఈవో సంకెపల్లి హరికిషన్‌పై ఆలయ ఈవో వినోద్‌రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఏఈవో హరికిషన్ కోసం గాలిస్తూనే ఉన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ సైతం ఆరా తీశారు. అయినా హరికిషన్ ఆచూకీ తెలియలేదు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు సమాచారం. ఫేక్ సర్టిఫికెట్తో పొందిన ప్రమోషన్ రద్దు కావడంతోపాటు పొందిన లబ్ధిని సైతం రికవరీ చేసేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తుందని ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కాగా ఫేక్ సర్టిఫికెట్లకు సహకరించిన ముగ్గురిపై ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment