మెరుగైన వైద్యం అందించాలి
రిజర్వేషన్లు పెంచాలి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచాలని నరేశ్ ప్రజాపతి డిమాండ్ చేశారు.
జిల్లా వైద్య విధాన పరిషత్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ చంద్రశేఖర్
8లోu
చేవెళ్ల: ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం మన బాధ్యత అని జిల్లా వైద్య విధాన పరిషత్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సౌకర్యాలను, వార్డులను, రోగులకు అందించే వైద్యం తీరును పరిశీలించారు. ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేలా పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది తప్పక సమయ పాలన పాటించాలన్నారు. గర్భిణులకు ఆస్పత్రిలోనే అని వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఆస్పత్రిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం డయాలసిస్ కేంద్రంలోని రోగులతో మాట్లాడారు. ఆయన వెంట ఏరియా ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment