గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం: 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లీలావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో, సైనిక్, ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్‌లోఐదు నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9704550233 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వండి
శేఖర్‌గౌడ్
షాద్‌నగర్‌రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వం అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. అంత్యోదయ కార్డుల కోసం పదేళ్లుగా దరఖాస్తులు ఇస్తున్నా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కుటుంబానికి 35 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మనీల, శ్రీను, రిజ్వానా, అంజమ్మ, జహంగీర్, చెన్నయ్య, కొమురయ్య, రాములమ్మ, రాణి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
‘వావ్’ నేదునూరు
మోడల్ స్కూల్
కందుకూరు: ఐటీసీ సంస్థ వావ్ ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ చాంపియన్ షిప్‌లో నేదునూరు మోడల్ స్కూల్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా.. పాఠశాల విద్యార్థి దిలీప్ కుమార్ ప్రథమ బహుమతి సాధించాడు. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ విష్ణుప్రియ ఆధ్వర్యంలో పాఠశాలలో సంబురాలు నిర్వహించారు. అవార్డుకు రావడానికి కారణమైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామం, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, కుముదిని, పరమేశ్, రమణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
భార్య హత్య కేసులో 14 రోజుల రిమాండ్
రంగారెడ్డి కోర్టులు: మీర్‌పేట్ ఠాణా పరిధిలో భార్యను అతికిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికిన నిందితుడు గురుముర్తిని పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా 6వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు నిందితుడికి వచ్చే నెల 11వ తేదీ వరకు వరకు రిమాండ్ విధించారు. భార్య వెంకట మాధవిని హత్య చేసిన కేసులో గురుమూర్తిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వనస్తలిపురం ఏరియా ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment