పేదలకే సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

పేదలకే సంక్షేమ ఫలాలు

Published Thu, Jan 30 2025 7:34 AM | Last Updated on Thu, Jan 30 2025 7:34 AM

-

ఇబ్రహీంపట్నం: ‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకే దక్కాలి.. వీటిని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు’అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఏడు పథకాలపై వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికతోపాటు సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఈజీఎస్‌, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆయా పథకాల అర్హుల జాబితాను రూపొందించడం సులువుగా మారుతుందన్నారు. ఉచిత విద్యుత్‌, రూ.500లకే వంట గ్యాస్‌ పథకాలు అందడం లేదని ఫిర్యాదులందుతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని అధికారులను ప్రశ్నించగా యాచారం ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి పది రోజుల గడువు కోరారు. ఫిబ్రవరి 10లోపు వివిధ పథకాల అర్హుల జాబితా సిద్ధం చేయాలని.. ఎందుకు అనర్హులో తెలియజేసేలా జాబితాలో పొందుపరచాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు గ్రామాల్లోని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులను సైతం సర్వే చేస్తున్న క్రమంలో అధికారులు వెంటబెట్టుకుని వెళ్లాలన్నారు. పథకాలు నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందే అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏ రూట్లో బస్సు సర్వీసులున్నాయి.. అదనంగా ఎన్ని బస్సులు కావాలో నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ డీపీ మేనేజర్‌ వెంకటనర్సప్పను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం స్పెషలాఫీసర్‌ నవీన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, చిలుక మధుసూధన్‌రెడ్డి, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్పిపల్‌ కమిషనర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్‌ సప్లె, ఉపాధిహామి అధికారులు హాజరయ్యారు. అనంతరం ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల బాధితులకు మంజూరైన రూ.42.56లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

విధులకు అడ్డోస్తే ఫిర్యాదు చేయండి

విధి నిర్వహణలో ఎవరైనా అడ్డుపడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి.. మీకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. అధికారులు సైతం ప్రభుత్వంలో భాగస్వాములేనని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి

వచ్చే నెల 10లోపు అర్హులు, అనర్హుల జాబితా సిద్ధం చేయాలి

దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు

మోడల్‌ నియోజకవర్గంగా ఇబ్రహీంపట్నం

సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

సివిల్‌ సప్లై అధికారిపై ఆగ్రహం

ఉచిత గ్యాస్‌ పథకం కింద ఎంత మంది లబ్ధిపొందుతున్నారో సివిల్‌ సప్లె డీటీ వినోద్‌కుమార్‌ను ఎమ్మెల్యే మల్‌రెడ్డి ప్రశ్నించగా.. కనుక్కుంటాను అని అధికారి సమాధానం చెప్పడంతో మండిపడ్డారు. కనీస సమాచారం లేకుండా ఎందుకొచ్చావ్‌.. పనిలేక ఈ సమావేశాన్ని పెట్టుకున్నామా అంటూ గద్దించారు. వెంటనే లబ్ధిదారుల జాబితా తెలుసుకోవాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement