రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించండి
కేశంపేట: మహేశ్వరం మండల పరిధిలోని పెద్ద గోల్కండ (ఓఆర్‌ఆర్ ఎగ్జిట్) నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దగోల్కొండ నుంచి కల్వకోలు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, దానికి అనుసంధానంగా కల్వకోలు నుంచి మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డును నిర్మించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణంపూర్తయితే శ్రీశైలం, బెంగుళూరు హైవేలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ రోడ్డు అవుతుందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 130 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడుబొక్క నర్సింహారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment