
బ్యాడ్మింటన్ పోటీలో సత్తా
హుడాకాంప్లెక్స్: జాతీయ స్థాయి డెఫ్ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలలో కొత్తపేటకు చెందిన బూర్చు సురేష్, అనూష దంపతుల కుమారుడు గోపి బ్యాడ్మింటన్‌లో జూనియర్ బాయ్స్ సింగిల్స్ అండర్–18లో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటాడు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన 2025 సంవత్సర ఆలిండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్ జాతీయ డెఫ్ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో తాను మెడల్స్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
స్వచ్ఛభారత్ నిర్వహించాలని తీర్పు
మీర్‌పేట: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా 2వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజులు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛభారత్ నిర్వహించాలని బుధవారం తీర్పునిచ్చింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. గుర్రంగూడకు చెందిన ఓ మహిళతో నందిహిల్స్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తి గొడవపడి ఆమెను దుర్భాషలాడడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రమేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా తీర్పు ఇచ్చింది.