
సంగారెడ్డి: కూర బాగాలేదని భర్త మందలించడంతో ఓ వివాహిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండలగూడలో నివాసం ఉండే అంజయ్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూర బాగాలేదని బార్య ప్రసన్నలక్ష్మీతో గొడవపడ్డాడు.
దీంతో ఆమె అదే రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇంట్లో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.