
జొన్న మొక్కలకు కట్లు
జహీరాబాద్ టౌన్: అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. ఈదురు గాలులు, వడగండ్ల వాన వల్ల జొన్న, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు కూలిపోయాయి.. కరెంట్ తీగలు తెగిపడ్డాయి. తెల్లజొన్న పంటకు ఎక్కువగా నష్టం జరిగింది. జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో జొన్నపంట సాగువుతోంది. ఈదురుగాలలు వల్ల పంట నేలకొరిగింది. పడిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు పైకెత్తి కట్లు కడుతున్నారు. పడిపోయిన జొన్నపంటకు ఐదారు మొక్కలు ఒకచోట కలిపి కట్టు కడుతున్నారు. ఇలా చేయడం వల్ల గింజలు దెబ్బతినకుండా ఉంటాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నారు.