కార్యాలయాలకు కసరత్తు
జిల్లాలో నూతనంగా ఏర్పడిన మూడు మండల పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలో దూల్మిట్ట, అక్బర్‌పేట–భూంపల్లి, కుకునూరుపల్లి మండలాలు గతంలోనే ఏర్పాటైన విషయం విదితమే. మండల పరిషత్‌లను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. దూల్మిట్ట మండల పరిధిలో 11గ్రామాలు. కుకునూరుపల్లి మండలం పరిధిలో 15 , అక్బర్‌పేట– భూంపల్లిలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం 23 ఎంపీడీఓ కార్యాలయాలుండగా కొత్తవాటితో కలిపి 26 కానున్నాయి.
సాక్షి, సిద్దిపేట: మూడు మండల కేంద్రాల్లో మండల పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. ఏవి అనుకూలమో ఆరా తీశారు. దూల్మిట్ట మండల పరిషత్ కార్యాలయాన్ని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు గ్రామ సభను ఏర్పాటు చేశారు. ప్రజలు మాత్రం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయవద్దంటూ పట్టుపట్టారు. ‘అవసరమైతే చందాలు వేసుకుని ప్రైవేట్ భవనం అద్దె చెల్లిస్తాం. కానీ పంచాయతీ కార్యాలయంలో వద్ద’ని గ్రామ సభలో ప్రజలు స్పష్టం చేశారు. అక్బర్‌పేట– భూంపల్లిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా గుర్తించారు. కుకునూరుపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని స్థానిక సీ్త్ర శక్తి భవన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు అవుతాయనే విషయం ఇంకా నిర్ధారించలేదు. ఉమ్మడి మండల పరిషత్ కార్యాలయం నుంచే ఫర్నిచర్ సర్దుబాటు చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి నేరుగా కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలున్నాయి.
కొత్త మండల పరిషత్‌లఏర్పాటుకు సన్నాహాలు
దూల్మిట్ట, అక్బర్‌పేట–భూంపల్లి,కుకునూరుపల్లికి ఇన్‌చార్జి ఎంపీడీఓలు 26కు పెరగనున్న ఎంపీడీఓ ఆఫీసులు
ఇన్‌చార్జి ఎంపీడీఓల నియామకం
మూడు మండల పరిషత్‌లకు ఇన్‌చార్జి ఎంపీడీఓలను కలెక్టర్ నియమించారు. దూల్మిట్టకు నంగనూరు ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావును, అక్బర్‌పేట–భూంపల్లికి దౌల్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం జయపాల్ రెడ్డి, కుకునూరుపల్లికి కొండపాక ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రాంప్రసాద్‌ను ఇన్‌చార్జి ఎంపీడీఓలుగా నియమిస్తూ కలెక్టర్ మనుచౌదరి ఉత్తర్వులను జారీ చేశారు.. అలాగే కార్యాలయ సిబ్బంది సైతం నియమించనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నిక కోడ్ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండకపోవచ్చని, నేరుగా కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment