నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు
● మున్సిపల్ కమిషనర్ నర్సయ్య
గజ్వేల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్మాణాలకు అనుమతి పొందిన యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. లేనిపక్షంలో 2019 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవ తప్పిదాలవల్లేరోడ్డు ప్రమాదాలు
● ఎంవీఐ శంకర్ నారాయణ
సిద్దిపేటజోన్: మానవ తప్పిదాల వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ నారా యణ అన్నారు. ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరికి రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండాలని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక క్రాంతి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా వాహన డ్రైవింగ్ లైసెన్సు పొందాలని, హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కుష్టు వ్యాధిని నివారిద్దాం
చిన్నకోడూరు(సిద్దిపేట): కుష్టు వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని వైద్యురాలు ఐశ్వర్య అన్నారు. గురువారం చిన్నకోడూరులో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులచే పత్రిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జ్వరంతో పాటు శరీరంపై మచ్చలు వాచి ఎర్రగా మారి నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తే కుష్టు వ్యాధిగా గుర్తించాలన్నారు. కళ్లు ఎర్రబడి నొప్పిగా ఉండటం, నీళ్లు కారడం, చూపు మందగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment