బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయండి
దుబ్బాకటౌన్: ప్రజాయుద్ధ నౌక గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. గద్దర్ జయంతి ఉత్సవాల గోడ పత్రికను గురువారం రాయపొల్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ చంపారో లెక్కచెప్పాలన్నారు. శుక్రవారం నగరంలో జరిగే గద్దర్ జయంతి సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు, విష్ణు, ప్రకాశ్, రాజు, కనకయ్య, రాజయ్య, అంజగౌడ్, తదితరులున్నారు.
కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం
సిద్దిపేటరూరల్: కేంద్ర మంత్రి చేసిన అసంబద్ద వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో మాలమహానాడు ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి గద్దర్ విశేష కృషి చేశారని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన గొప్పవ్యక్తి అన్నారు. వెంటనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్
Comments
Please login to add a commentAdd a comment