చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
చేర్యాల(సిద్దిపేట): అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానికంగా అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. స్థానిక గాంధీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు అధ్యక్షతన ఏర్పాటుచేసిన శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారని, కానీ చేర్యాలను మరిచారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మాట ఇచ్చి విస్మరించడం తగదన్నారు. రెవెన్యూ డివిజన్ చేస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.ధర్నాలో అఖిల పక్ష నాయకులు మల్లారెడ్డి, కనకారెడ్డి, కేవీఎల్‌ఎన్‌రెడ్డి, సురేష్, రాజు, బాల్‌నర్సయ్య, కరుణాకర్, రాజేందర్, శ్రీధర్, మల్లేశం, చందు, పర్వతాలు, అంజయ్య, ఎల్లారెడ్డి, మానస, రంజిత, పద్మ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సాధించే వరకు పోరాటం
మహా ధర్నాలో ఎమ్మెల్యే పల్లా,ఎమ్మెల్సీ అలుగుబెల్లి
Comments
Please login to add a commentAdd a comment